ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మౌలిక వసతులు కల్పిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తారని తెలిపారు. వనపర్తిలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
'ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధికి బాటలు' - telangana agriculture minister
ప్రజల అవసరాలకు అనుగుణంగా.. సీఎం కేసీఆర్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వనపర్తి నడిబొడ్డున ఉన్న పాత మార్కెట్ యార్డులో రూ.19.50 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రెండంతస్తులతో 85 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 70 వ్యాపార దుకాణాలు, 120 కూరగాయల దుకాణాలు, సూపర్ మార్కెట్ , చిల్డ్రన్ పార్క్ , 28 నాన్ వెజ్ దుకాణాలు, పండ్ల దుకాణాలు ఇందులో ఉంటాయని చెప్పారు.
ఎకో పార్క్ సమీపంలో రూ.3 కోట్లతో వే సైడ్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వనపర్తి జనాభా భవిష్యత్లో 3, 4 లక్షలకు చేరుకున్నా ఇబ్బంది లేకుండా మార్కెట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.