తెలంగాణ

telangana

ETV Bharat / state

సంపు గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి - వనపర్తి జిల్లా

గత మూడు రోజులుగా కనిపించకుండాపోయిన ఓ యువకుడు శవమై తేలిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని శివాలయం ఆవరణలో గల సంపు గుంతలో పడి మరణించాడు.

వనపర్తి జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి
వనపర్తి జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

By

Published : May 26, 2020, 1:46 PM IST

వనపర్తి జిల్లా గోపాల్ పేటలోని శివాలయం ఆవరణలో గల సంపు గుంతలో పడి ఓ యువకుడు మరణించాడు. గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన రహూఫ్ అనే యువకుడు ఏదుల గ్రామానికి చెందిన ఎస్సీ అమ్మాయిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎస్సీ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మృతుడి తల్లిదండ్రులు నూతన జంటను ఇంట్లోకి రానివ్వలేదు. ఫలితంగా రెండేళ్లుగా బయటే దాంపత్య జీవితాన్ని కొనసాగించాడు. ఇటీవలే తన భార్య గర్భవతి కావడం వల్ల ప్రసవానికి 3 నెలల క్రితమే పుట్టింటికి వెళ్ళింది.

గోపాల్ పేటలో ఉంటున్న క్రమంలో...

ఈ క్రమంలో గోపాల్ పేటలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్న క్రమంలో రహూఫ్ కనిపించకుండా పోయాడు. సంపు గుంతలో శవమై తేలడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. సంఘటనపై విచారణ అనంతరం యువకుడి మరణానికి గల కారణాలను వెల్లడిస్తామని వనపర్తి ఆలయాధికారి సూర్య నాయక్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఓయూ భూములను పరిరక్షిస్తాం: చాడ, కోదండరాం

ABOUT THE AUTHOR

...view details