వనపర్తిలో కోచింగ్ పేరుతో అభం శుభం తెలియని చిన్నారులపై అఘాత్యాలకు పాల్పడిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు శరత్‌ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం గోపాలపేట మండలం ఎదుట్లలో విద్యార్థులు ధర్నాకు దిగారు. విచారణ పేరుతో సంవత్సరాలుగా అతడిని మేపొద్దని... తక్షణమే విచారణ జరిపి ఉరితీయాలని డిమాండ్ చేశారు.
'కీచక టీచర్ని ఉరి తీయండి'
అభం శుభం తెలియని చిన్నారులపై అఘాత్యానికి పాల్పడిన ప్రైవేటు ఉపాధ్యాయుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ గోపాల్‌పేటలో విద్యార్థులు ధర్నాకు దిగారు.
'కీచక టీచర్ని ఉరి తీయండి'
ధర్నాలో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆందోళన విరమించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా వారు పట్టువిడవలేదు. అనంతరం వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకొని గ్రామస్థులతో చర్చలు జరిపి... త్వరలోనే అతనిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి:నస్పూర్‌లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
Last Updated : Mar 6, 2020, 9:28 PM IST