తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​కు దూరం ఉందాం

వాళ్ల వయసు చిన్నదే. కానీ ఆలోచన పెద్దది. పర్యావరణ పరిరక్షణ కోసం.. నడుం బిగించారు. ఈ ఆలోచనే పెద్దలను ఆలోచించేలా చేసి వారిలో మార్పు తీసుకొచ్చింది. పర్యావరణ హితం కోసం విద్యార్థులు పడే తపన అక్కడి స్థానికులను ప్లాస్టిక్​కు దూరం చేసింది. ఇంతకీ ఈ మార్పు ఎలా సాధ్యమంటారా...! అయితే వనపర్తిలోని చాణక్య పాఠశాలకు వెళ్లాల్సిందే.

By

Published : Mar 5, 2019, 1:54 PM IST

Updated : Mar 5, 2019, 2:53 PM IST

విద్యార్థులు

ప్లాస్టిక్​ను వాడొద్దంటూ విద్యార్థుల అవగాహన
ప్లాస్టిక్​ వాడకం పర్యావరణానికి హానికరమని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో నిషేధం జరగడం లేదు. వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చేపట్టిన వినూత్న ఆలోచన నగర ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది. దాదాపు ఆరు వేల కుటుంబాలకు ప్లాస్టిక్​ను దూరమయ్యేలా చేశారు ఆ చిన్నారులు.

మార్పు తీసుకొచ్చారిలా

వనపర్తిలో చాణక్య పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఆలోచనతో విద్యార్థులు అందరిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఇంటి నుంచి బట్టతో కుట్టిన మూడు బ్యాగులను తయారు చేసి ఒకటి ఇంట్లోనే ఉంచి రెండు చుట్టపక్కల ఇళ్లలో పంచారు. ఇకపై ప్లాస్టిక్​ సంచులు వాడకుండా వీటినే ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. వాటర్​ ప్యాకెట్లు కాకుండా రాగి, స్టీల్​ సీసాలను వాడుకోవాలని సూచించారు.
విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం అందరినీ అబ్బురపరుస్తోంది. ఇకపై ప్లాస్టిక్​ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తామని స్థానికులు తెలిపారు. సర్కారు వీటిని రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి :హెచ్​ఐవీ మాయం!

Last Updated : Mar 5, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details