ప్రభుత్వ కళాశాల మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన... అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేస్తారని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
'పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కళారూపాల ప్రదర్శనలు'
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని జిల్లా పాలనాధికారి తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు సన్మానం ఉంటుంది
ఇవీ చూడండి : ఓటేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు