ఆత్మకూరు మండలంలో రాష్ట్ర సీఐడీ డీఐజీ పర్యటన - state cid dig participated in palle pragathi programm at vanaparthy district
రాష్ట్ర సీఐడీ విభాగం డీఐజీ గోవింద్ సింగ్ ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామాలను సందర్శించారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచర్ల, జూరాల గ్రామాలను పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర సీఐడీ విభాగం డీఐజీ గోవింద్ సింగ్ సందర్శించారు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ , స్మశాన వాటికల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం పరిశీలించారు. అనంతరం పాఠశాలను సందర్శించి అధికారులకు తగు సూచనలు అందించారు. పాఠశాల వంట గదిలో వంట గ్యాస్ సిలిండర్లను వాడాలని, అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య ,అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్ కుమార్ ,సిఐ సీతయ్య, అధికారులు పాల్గొన్నారు.