తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక వాహనాల వేగానికి కళ్లెం వేయనున్న పోలీసులు - జిల్లా ఎస్పీ అపూర్వరావు

అతివేగం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు వనపర్తి జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్‌ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.

ఇక వాహనాల వేగానికి కళ్లెం వేయనున్న పోలీసులు

By

Published : Jun 24, 2019, 10:41 PM IST

వనపర్తి జిల్లా పరిధిలో వాహనాల వేగాన్ని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ అపూర్వరావు జిల్లా కేంద్రంలో స్పీడ్ గన్​ను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా పరిధిలోని రహదారులపై వాహనాల వేగాన్ని గుర్తించి వారికి జరిమానా విధించేందుకు సులువుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అతివేగంకు 1,400 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించారు. రహదారులపై సూచించిన దాని కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి వారికి ఆన్​లైన్​లోనే జరిమానా విధిస్తామని ఆమె తెలిపారు. వాహనచోదకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు నడిపే వాహనాలను పరిమిత వేగంతోనే వెళ్లాలని సూచించారు. అతివేగంతో వెళ్లి ఏదైనా ప్రమాదానికి గురైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక వాహనాల వేగానికి కళ్లెం వేయనున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details