తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన శ్వేతా మహంతి​ - latest news on Shweta Mahanthi

వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి శ్వేతా మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన శ్వేతా మహంతి​

By

Published : Nov 21, 2019, 8:05 PM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి శివారులో వ్యవసాయ పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శ్వేతా మహంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో అధికారులు నమోదు చేసిన దస్త్రాలను పరిశీలించారు. దస్త్రాలలో పూర్తి వివరాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలను... కొనుగోలు కేంద్రం నుంచి అధికారులకు పంపించే ప్రతి బస్తా వివరాలను నమోదు చేయాలని వారికి సూచించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు కావలసిన టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన శ్వేతా మహంతి​

ఇదీ చూడండి: 'వ్యక్తిగత గోప్యత సురక్షితంగా ఉంచాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details