తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి - వనపర్తి జిల్లా తాజా వార్త

వనపర్తి జిల్లా సింగపేట గ్రామశివారులో పిడుగుపాటుకు ఓ గొర్రెలకాపరితో పాటుగా మూడు గొర్రెలు మరణించాయి.

Shepherd dead by the thunderstorm in wanaparthy
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

By

Published : Jun 1, 2020, 4:42 PM IST

వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగపేట గ్రామ శివారులో ఓ గొర్రెల కాపరి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి కాపరితోపాటు మూడు గొర్రెలు మరణించాయి.

మృతుడు కొంకన్నోని పల్లె గ్రామానికి చెందిన కుర్వ చిన్న అంజలన్నగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు.

ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా

ABOUT THE AUTHOR

...view details