కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక సంఘం సభ్యులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 20 నుంచి ఆగస్టు 1 వరకు వ్యాపార సముదాయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంఘం తరఫున తీర్మానం చేసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ను కచ్చితంగా అమలుపర్చాలని సూచించారు.
వనపర్తిలో 20 నుంచి ఆగస్టు 1 వరకు స్వచ్ఛంద లాక్డౌన్
వనపర్తిలో ఈ నెల 20 నుంచి ఆగస్టు 1 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించనున్నట్లు వ్యాపార, వర్తక సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు సంఘం తరఫున తీర్మానం చేసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ను కచ్చితంగా అమలుపర్చాలని నిర్ణయించారు.
వనపర్తిలో 20 నుంచి ఆగస్టు 1 వరకు వ్యక్తిగత లాక్డౌన్
వనపర్తి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాపార సంఘ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్క వ్యాపారస్థుడు సంఘం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఇప్పటికే పట్టణంలోని అన్ని కాలనీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయని... ఇంకా నిర్లక్ష్యం చేస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కాదని ప్రజలకు వివరించారు.