వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు - A BIG HOLE TO SARALA SAGAR RESERVOIR
![వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు sarala-sagar-reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5545478-thumbnail-3x2-ppp.jpg)
07:16 December 31
వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి
ఆసియాలోనే ఆటోమెటిక్ సైఫన్ సిస్టం కలిగిన తొలి జలాశయంగా పేరొందిందిన సరళాసాగర్కు గండి పడింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద సరళాసాగర్ జలాశయానికి గండి పడి కట్ట తెగిపోయింది. పదేళ్ల తర్వాత నిండిన సరళాసాగర్ జలాశయానికి భారీగా నీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు.
జలాశాయానికి గండి పడటం వల్ల మదనాపురం-ఆత్మకూరు ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. మదనాపురం-ఆత్మకూరు రోడ్డులోని వంతెనపై నీరు చేరగా... రాకపోకలు నిలిచిపోయాయి.