దేశ చరిత్రలో పారిశుద్ధ్య కార్మికులకు కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో ఆయన సమావేశమయ్యారు.
పారిశుద్ధ్య కర్మచారులందరూ తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని శ్రీనివాసన్ సూచించారు. తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అనంతరం.. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.