వనపర్తి జిల్లా కేంద్రం నుంచి చిట్యాల వెళ్లే రహదారి విస్తరణ పనులను రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రోడ్ల విస్తరణలో ఇల్లు కోల్పోయిన ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.
వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం : నిరంజన్ రెడ్డి - development works in wanaparthy
వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రానికి అనుసంధానంగా చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.
వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం : నిరంజన్ రెడ్డి
గడిచిన 20 ఏళ్లలో పట్టణం అభివృద్ధి చెందిందని... జనసాంద్రత పెరిగి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రమాదాలు జరగకుండా రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధికి సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో వైద్య పరికరాలను అందజేశారు.