తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి : కలెక్టర్ యాస్మిన్ భాష - wanaparthy municipality latest News

వనపర్తి జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యంపై కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, వాగులు, నాలాల ఆక్రమణలపై పలు శాఖల అధికారులతో చర్చించారు.

ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి : కలెక్టర్ యాస్మిన్ భాష
ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి : కలెక్టర్ యాస్మిన్ భాష

By

Published : Sep 20, 2020, 7:50 AM IST

చెరువులు, కుంటల నాలాలు, ఎఫ్​టీఎల్​ల ఆక్రమణలకు తొలగించేందుకు ఇరిగేషన్, మున్సిపల్ ,రెవెన్యూ అధికారులతో సర్వే బృందాలను ఏర్పాటు చేస్తునట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. శనివారం ఆమె తన చాంబర్​లో వర్షాల కారణంగా నిండిన చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యం తదితర అంశాలపై సమీక్షించారు. చెరువులు, కుంటల ఆక్రమణలపై చర్చించారు.

సర్వే చేసి తొలగించాలి..

ఈ నెల 21 నుంచి మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ సంయుక్త బృందాలు జిల్లా, మున్సిపల్ పట్టణ ప్రాంతాలతో పాటు మండలాల్లోనూ చెరువులు, కుంటల నాళాలు, ఎఫ్​టీఎల్​లు ఆక్రమణలకు గురైతే సర్వే చేసి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆక్రమణలుంటే వెంటనే తొలగించండి : కలెక్టర్ యాస్మిన్ భాష

తాళ్లచెరువు ఆక్రమణలు తొలగిచండి..

సోమవారం నుంచి వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు నాలా ఆక్రమణలను గుర్తించి తొలగించమని ఆదేశింంచారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, వనపర్తి తహసీల్దార్ రాజేందర్ గౌడ్ డిప్యుటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : తేనెపూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు: కేసీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details