ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్, దస్తావేజుల లేఖర్లు.. వనపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అర్హత గల దస్తావేజుల లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేయాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు..ఎల్ఆర్ఎస్ మరింత భారంగా మారింది. దీనిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.