తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగ్రహించిన అన్నదాత... ధాన్యం కొనాలని రాస్తారోకో

కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కొనగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షానికి తడిసి నేలపాలైంది. ఆగ్రహించిన రైతన్నలు తడిసిన ధాన్యం కొనాలని రాస్తారోకో చేశారు.

ధాన్యం కొనాలని రైతన్నల రాస్తారోకో

By

Published : Apr 22, 2019, 10:05 PM IST

వనపర్తి జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. పది రోజుల నుంచి ధాన్యం తెచ్చినా... సింగిల్ విండో అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఎట్టకేలకు నిన్న కేంద్రాన్ని ప్రారంభించినా పంటను కొనుగోలు చేయలేదు. సాయంత్రం కురిసిన అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిసిపోయింది. ఆగ్రహించిన అన్నదాతలు మార్కెట్ యార్డ్ ముందు రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే వరకు రాస్తారోకో విరమింపజేసేది లేదని అన్నారు. పోలీసులు పలుమార్లు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది.

ధాన్యం కొనాలని రైతన్నల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details