వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరు, పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. పెంచిన పింఛన్ ప్రొసిడింగ్ పత్రాలను లబ్ధిదారులుకు అందించారు. తనతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వారానికోమారు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలన్నారు.
పేదల కోసమే పింఛన్ల పెంపు: నిరంజన్ రెడ్డి - minister
పెంచిన పింఛన్లతో ప్రభుత్వంపై కోట్ల రూపాయల భారం పడుతున్నా ఇచ్చిన మాటకు కేసీఆర్ కట్టుబడ్డారని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో పింఛన్ ప్రొసిడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందించారు.

సహాపంక్తి భోజనం చేస్తున్న మంత్రి