వనపర్తి జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రామన్ పాడు జలాశయానికి భారీ వరద రావడంతో ఐదు గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదలతో ఊకచెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్పరాల, తిప్పుడంపల్లి మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి.
జోరువానలు... పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు - rain in wanaparthy district
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రామన్ పాడు జలాశయానికి భారీ వరద రావటంతో ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
అపరాల, రామకృష్ణాపురం, మిరాసిపల్లి, విలియంకొండ, పాలెం, ముమ్మలపల్లి రాయినిపేట, చర్లపల్లి గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పెబ్బేరు మండలం నాగరాలలో వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగసముద్రం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయటంతో జానంపేట , వెంకటాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:శ్రీరాం సాగర్‌కు వరద పోటు.. 40 గేట్లు ఎత్తి నీరు విడుదల