వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ యువతిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఎస్సీ సంఘాలు డిమాండ్ చేశాయి. అమరచింత పురపాలక శివారులో యువతిపై కొందరు కిరాతకులు హత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆత్మకూరు పట్టణంలోని గాంధీచౌక్‌లో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
'హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి' - వనపర్తి జిల్లా సమాచారం
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ యువతిపై హత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆత్మకూరు పట్టణంలోని గాంధీచౌక్‌లో భారీఎత్తున రాస్తారోకో నిర్వహించాయి.

'హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి'
దిశ తరహాలో ఎన్‌కౌంటర్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఎస్సీ సంఘాలు ఆందోళన విరమించాయి.