అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. 12 ఎకరాల స్థలంలో రూ.8 కోట్లా 50 లక్షలతో నిర్మించిన హాస్టల్ భవన సముదాయాన్ని అధికారులకు అప్పగించారు. స్నేహ పూర్వకంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ అనంత తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించండి: మంత్రి నిరంజన్ రెడ్డి - schools
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవన సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
నాణ్యమైన విద్యనందించండి