హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో పాఠశాల రెన్యూవల్‌కు డబ్బులు తీసుకున్నారని కొత్తకోటకు చెందిన మల్లేశ్ ఆరోపించారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో ఉన్న కృష్ణవేణి పాఠశాలను రెన్యువల్ చేయడానికి రూ.30వేలు తీసుకున్నారని మల్లేశ్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్జేడీ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ సతీశ్‌తో సంభాషించిన దృశ్యాలను ఆయన రహస్యంగా తన చరవాణిలో చిత్రీకరించారు. రెండు నెలలుగా ఆర్జేడీ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకోకుండా పని చేయడం లేదని మల్లేశ్ ఆరోపిస్తున్నారు.
రెన్యూవల్‌కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ - ఆర్జేడీ కార్యాలయం
పాఠశాల రెన్యూవల్ కోసం డబ్బులు తీసుకున్నారని ప్రైవేట్ స్కూల్ యజమాని ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కృష్ణవేణి స్కూల్ యజమాని మల్లేశ్ హైదరాబాద్‌లోని ఆర్జేడీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌కు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
రెన్యూవల్‌కు డబ్బులు తీసుకున్నారని పాఠశాల యజమాని ఆరోపణ
మా వద్ద పెండింగ్‌లో లేదు:
పాఠశాల ప్రారంభించడానికి చెల్లించాల్సిన చలానా డబ్బుల గురించి మాత్రమే మల్లేశ్ వద్ద ప్రస్తావించానని.. అతని వద్ద డబ్బులు తీసుకోలేదని ఆర్జేడీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సతీశ్ ఈటీవీ ప్రతినిధికి తెలిపారు. కృష్ణవేణి పాఠశాల రెన్యూవల్ చేశామని.. దానికి సంబంధించి ఎలాంటి ఫైళ్లు తమ కార్యాలయంలో పెండింగ్‌లో లేవని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆర్జేడీ రమేశ్ వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి రాలేదని.. మల్లేశ్ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తానని ఆయన వెల్లడించారు.