తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీలు అమ్మితే... పీడీ యాక్టే: జిల్లా ఎస్పీ - press-meet-on-nakili-seeds in wanaparthy

వనపర్తి జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. ఏదుల గ్రామంలో 89కిలోల నకిలీ విత్తనాలు అమ్మే దుకాణదారునిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

నకిలీలు అమ్మితే... పీడీ యాక్టే: జిల్లా ఎస్పీ

By

Published : May 22, 2019, 4:56 PM IST

మంగళవారం వనపర్తి జిల్లా ఏదుల గ్రామంలో ఎస్పీ రెడ్డి అనే ఎరువుల దుకాణం నుంచి 89 కిలోల కందులు, టమాటా ఇతర విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అపూర్వ రావు వెల్లడించారు. నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారుపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోయినట్లు గ్రహిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైతే నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నకిలీలు అమ్మితే... పీడీ యాక్టే: జిల్లా ఎస్పీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details