పోలీసు వ్యవస్థలో ఉన్న, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పర్వతారోహణకు సంబంధించిన సాహసాలు మానసిక ఆత్మస్థైర్యం, మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని తెలంగాణ పర్వతారోహణ సంస్థ ముఖ్య కార్యనిర్వాహకుడు రాజేందర్ అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని పోలీసులకు వనపర్తి శివారులో గల తిరుమల గుట్టపై పర్వతారోహణ శిబిరాన్ని నిర్వహించి పోలీసులతో సాహసకృత్యాలు చేయించారు.
పర్వతారోహణతో ఆత్మస్థైర్యం రెట్టింపు: రాజేందర్ - తెలంగాణ వార్తలు
పర్వతారోహణకు సంబంధించిన సాహసాలు మానసిక ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని తెలంగాణ పర్వతారోహణ సంస్థ ముఖ్య కార్యనిర్వాహకుడు రాజేందర్ అన్నారు. వనపర్తి శివారులో గల తిరుమల గుట్టపై పర్వతారోహణ శిబిరాన్ని నిర్వహించి పోలీసులతో సాహసకృత్యాలు చేయించారు.
'పర్వతారోహణతో మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు'
తాడుతో గుట్ట ఎక్కడం, దిగటం లాంటి పలు కార్యక్రమాలను పోలీసులతో చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని పానగల్, పెబ్బేరు, గోపాల్పేట, పెద్దమందడి, వనపర్తి, ఖిల్లా గణపురం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే 40 మంది కానిస్టేబుళ్లు పాల్గొని సాహసకృత్యాలు చేశారు. వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్తో పలువురు ఎస్సైలు కూడా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం