వనపర్తి జిల్లాలో ఈ- చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులు నుంచి పోలీసులు చలాన్లు కట్టించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి చలాన్లు కట్టకుండా తిరుగుతున్న చోదకుల ఆట పనిపడుతున్నారు. ఒక్కో మోటార్ సైకిల్‌పై దాదాపు 20 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని వనపర్తి సీఐ సూర్యనాయక్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వాహనం నుంచి మూడుసార్లు చలాన్లు వసూలు అయిఉంటే ఆ వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.
ముక్కుపిండి మరీ కట్టిస్తాం.. - వనపర్తి జిల్లా పోలీసు వలయాధికారి సూర్యనాయక్.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వనపర్తి సీఐ సూర్యనాయక్.

ముక్కుపిండి మరీ కట్టిస్తాం..