వనపర్తి జిల్లా మారమ్మకుంట సమీపంలో గల ప్రభుత్వ భూమిలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి శంకు స్థాపన చేస్తుండగా... అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. దీన్నీ ఎస్సీ కమ్యూనిటీ హాలు, అంబేడ్కర్ భవనాలు, పార్కుల ఏర్పాటుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల ధర్నాతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వ్యవసాయ మంత్రికి చేదు అనుభవం... శంకుస్థాపన అడ్డగింత - డబుల్బెడ్రూం ఇళ్ల శంకుస్థాపన అడ్డగింత
వనపర్తి జిల్లా మారమ్మకుంటలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు.
శంకుస్థాపన అడ్డగింత
Last Updated : Jul 13, 2019, 4:12 PM IST