తెలంగాణ

telangana

ETV Bharat / state

కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు - wanaparthy district news today

ఆత్మకూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు కందుల కొనుగోలు కేంద్రంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులైనా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Peasants' Farmers problems Purchase Center at atmakur wanaparthy
కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు

By

Published : Feb 1, 2020, 6:39 PM IST

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రంలో రైతులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు గాస్తున్నారు. అయినా కందులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిల్వ ఉన్న వాటితో పాటు కొత్తగా తెచ్చిన కందులను కొనుక్కునేందుకు టోకెన్లు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు నేరుగా పలువురు వ్యాపారులు కొని, తిరిగి వాటిని కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించి ఎక్కువ ధర పొందేందుకు యత్నిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు

ఇదీ చూడండి :'ప్రజలకు అవసరమైన చోట పనిచేయాలి'

ABOUT THE AUTHOR

...view details