farmer problems: వనపర్తి జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. పల్లి పంటకు అధిక ధర వస్తుందని భావించిన అన్నదాతలు.. వేల పెట్టుబడులు భరించి పండించారు. క్వింటాల్ విత్తనం కోసం రైతులు 12 వేలు చెల్లించారు. సాగు ప్రారంభించినప్పటి నుంచి ఎరువులు, కలుపు, పురుగు మందులు పిచికారీ చేసి తెగుళ్లను నివారించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దిగుబడి ఆశానజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి కనీసం 30 బస్తాలు వస్తే... 10 క్వింటాళ్లు విక్రయించిన రైతుకు 50 వేలు మిగులుతుందన్నారు. కానీ, ప్రస్తుతం ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు రావటమే కష్టంగా మారిందన్నారు. పంటను విక్రయించగా వచ్చిన సొమ్ముతో కూలీలకు కూలీ చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి దారుణంగా ఉంది..
ప్రస్తుతం పల్లికి 7 నుంచి 8 వేలు ధర పలుకుతుంది. వేరుశనగ సాగు చేయటానికి అధిక పెట్టుబడులు అవుతుండగా.. దిగుబడి లేకపోవటంతో అప్పులే మిగులుతున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతోందని.. ఆ పంటలు పండిస్తే పరిస్థితి దారుణంగా ఉందని అన్నదాతలు వాపోతున్నారు. ఆరుతడి పంటలకు 7 వేలకు పైగా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లేదంటే ఊరి వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
బూడిదే మిగిలేది..
నాలుగు ఎకరాల్లో 12వేల రూపాయలు పెట్టి విత్తనాలు కొని వేరుశనగ వేశాం. 50బస్తాల వేరుశనగ పండింది. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగినయి. రూ.400 ఇవ్వకపోతే కూలీలు వస్తలేరు. మెషీన్‌కు వేయాలంటే ఎకరాకు 5వేలు తీసుకుంటున్నారు. ఎరువుల కోసం బాగా ఖర్చువుతోంది. మచ్చతెగులు వచ్చి మందు కొడితే.. మంచు కురవడం వల్ల బూడిద తెగులు తాకి వేరుశనగ దిగుబడి వస్తలేదు. తెగుళ్లు తాకి కాయలు భూమిలోనే రాలిపోతున్నయి. మక్కలు, వరి వేయొద్దు అని చెప్పారు.. మీరు చెప్పినట్లు చేసినందుకు మాకు బూడిదే మిగిలేది. మాకు ప్రత్యామ్నాయం చూపించాలి. -వేరుశనగ రైతు
పండించినా లాభం లేదు..