తెలంగాణ

telangana

ETV Bharat / state

Paddy Seize: కర్నూలు ధాన్యం విక్రయం... సీజ్ చేసిన అధికారులు - అక్రమంగా విక్రయిస్తున్న ధాన్యం సీజ్

ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వరిధాన్యం తీసుకొచ్చి వనపర్తి జిల్లాలో విక్రయిస్తుండగా అధికారులు జప్తు చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి... కర్నూలు నుంచి తక్కువ ధరకు తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామస్థులు అదనపు కలెక్టర్​కు సమాచారమిచ్చారు.

paddy seize in  suguru village
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరులో వరిధాన్యం సీజ్

By

Published : May 30, 2021, 9:25 AM IST

కర్నూలు జిల్లా నుంచి ధాన్యం తెచ్చి... వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ జప్తు చేశారు. పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి విజయ్‌కుమార్‌ (జయన్న) కర్నూలు జిల్లాలో ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా సూగూరుకు శనివారం తరలించారు. మొత్తం 460 సంచులు (ఒక్కో సంచి 70 కిలోలు) సూగూరు సింగిల్‌ విండో కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతు వేదిక సమీపంలో నిల్వ చేశారు.

గ్రామస్థులు అదనపు కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆయన గ్రామానికి చేరుకొని పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ డీఎం అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ ఘన్షీరామ్‌, ఇన్‌ఛార్జీ ఎస్సై రాముతో కలిసి విచారణ చేశారు. బస్తాలు 322 క్వింటాళ్లు ఉంటాయని అధికారులు గుర్తించారు. ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని రైతు వేదిక భవనంలోకి తరలించారు. పూర్తిస్థాయి విచారణ చేసి నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఎస్సైని ఆదేశించారు.

ఇదీ చూడండి:రాష్ట్రాలను టీకాలు సమీకరించుకోమనటం కేంద్రం తప్పే: జేపీ

ABOUT THE AUTHOR

...view details