వనపర్తి జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలో ఉన్న ఊకచెట్టు వాగుకు వరద పోటెత్తడం వల్ల వాగుపై ఉన్న మట్టి దారి తెగిపోయి పాత జంగమాయపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి.
వనపర్తి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - wanaparthy rain news
వనపర్తి జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల పంటలు నీటమునిగాయి.
వనపర్తి జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
కానాయపల్లి వద్ద ఉన్న శంకరసముద్రం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడం వల్ల ప్రాజెక్టున్న 3 గేట్లను అడుగు మేర పైకెత్తి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు డీఈ సుష్మా తెలిపారు. రామన్ పాడు జలాశయం 2 గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు.