వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన చిన్న కిష్టన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పదేళ్ల కిందట మృతి చెందడం జరిగింది. అతని భార్య పిల్లలు జీవనోపాధికై హైదరాబాదుకు వలస వెళ్లి జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు మద్దిలేటి ఊర్లో ఉండి 7 ఎకరాల భూమి సాగు చేసుకుని బ్రతుకుతున్నాడు.
ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు.. - Murder in Wanaparthy District
వనపర్తి జిల్లాలో అర ఎకరా భూమి కోసం కన్న తండ్రిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ సూర్య నాయక్ తెలిపారు.
ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు..
తండ్రి పేరున ఉన్న అర ఎకరా భూమి కూడా ఇవ్వాలని రాత్రి మద్యం సేవించి తండ్రితో తగదా పెట్టుకున్నాడు. ఈ ఘటనలో తండ్రిని రాయితో కొట్టటం వల్ల అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి..