వనపర్తి జిల్లా అమరచింత మండలం కొంకణోనిపల్లిలో దారుణం వెలుగుచూసింది. ఆస్తి తగాదాలతో అన్నను దారుణంగా హతమార్చాడో తమ్ముడు. పెద్దరాజు, చిన్నరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాలతో తమ్ముడైన చిన్నరాజు రోకలిబండతో తన అన్న తలపై గట్టిగా బాదాడు. తీవ్రగాయాలపాలైన పెద్దరాజు రక్తస్రావంతో అక్కడిక్కడే మరణించాడు. సోదరుడు మరణించిన విషయం తెలుసుకున్న చిన్నరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఆస్తి తగాదాలతో అన్నను చంపిన తమ్ముడు - wnp
ఆస్తి తగదాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత అన్నను రోకలి బండతో మోదీ చంపేశాడో రాక్షసుడు.
అన్నను చంపిన తమ్ముడు