తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే' - వనపర్తి జిల్లా కలెక్టర్

మున్సిపాల్టీలోని మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించే బాధ్యత మున్సిపల్ సిబ్బందిదేనని వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి అన్నారు. జిల్లాకేంద్రంలోని కమలానగర్​ వార్డులో ఆమె పర్యటించారు.

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'

By

Published : Aug 18, 2019, 9:47 AM IST

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'

ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ రజనీకాంత్​ రెడ్డిని వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి ఆదేశించారు. వనపర్తిలోని కమలానగర్​ వార్డులో పర్యటించి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురుగు నీరు రోడ్డుపైకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్​ కాలనీ లేఅవుట్లు చూసి ప్రణాళిక ప్రకారం మురికి కాలువల నిర్మాణంపై తనకు సమాచారం అందించాలని మున్సిపల్​ కమిషనర్​ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details