ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహించుకునే జిల్లా స్థాయి సమావేశాలు, సర్వసభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు హుందాతనంగా వ్యవహరించాలని ఎంపీ రాములు సూచించారు. వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య మొదటి సమావేశానికి హాజరైన ఎంపీ... ప్రజా ప్రతినిధులను పలు సూచనలు, సలహాలు చేశారు. సామరస్యపూర్వకంగా మాట్లాడి అధికారులతో పనులు చేయించుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలకు సంబంధించిన వినతులను సభ్యులు విన్నవించారు. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, వెటర్నరీ ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులకు ఛైర్మన్ నచ్చజెప్పారు.
సమావేశాల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి... - జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య మొదటి సమావేశానికి ఎంపీ రాములు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య జరిగిన సంఘర్షణ పట్ల పలు సూచనలు చేశారు. సమస్యలుంటే సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని తెలిపారు.
MP RAMULU SUGGESTED TO POLITICAL LEADERS TO HOW TO BEHAVE IN MEETINGS