తెలంగాణ

telangana

ETV Bharat / state

వంద డ్రా చేస్తే.. 500 వచ్చాయి.. ఎగబడిన జనం - వంద డ్రా చేస్తే.. 500 వచ్చాయి

ఆ ఏటీంలోకి వెళ్లి 100 రూపాయలు డ్రా చేస్తే... 500 వచ్చాయి. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే 5వేలొచ్చాయి. మూడు రోజులుగా ఇదే జరగుతున్నా.. అదనంగా డబ్బులు తీసుకున్న వాళ్లు విషయాన్ని రహస్యంగా ఉంచారు. లాక్ డౌన్ ఉన్నా జనం గుంపులుగా ఎందుకున్నారని పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

వంద డ్రా చేస్తే.. 500 వచ్చాయి.. ఎగబడిన జనం
వంద డ్రా చేస్తే.. 500 వచ్చాయి.. ఎగబడిన జనం

By

Published : May 16, 2021, 4:29 AM IST

వందకు....5వందలు ఇది బెట్టింగ్‌ కాదు. వనపర్తి జిల్లా అమరచింతలోని ఓ ఏటీఎంలో వంద రూపాయలు డ్రాచేస్తే 500 రూపాయలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎంను బంద్‌ చేశారు. 100 రూపాయల నోట్లు పెట్టాల్సిన అరలో 500 రూపాయల నోట్లు పెట్డడం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.

ఏటీఎం నుంచి 5 లక్షల 88వేల రూపాయలు అదనంగా డ్రా అయినట్లు గుర్తించిన బ్యాంక్‌ అధికారులు డబ్బులు డ్రా చేసుకున్న వారి నుంచి తిరిగి రికవరీ చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 8 నెలల గర్భిణీ అయినా.. కరోనా రోగులకు సేవలు..

ABOUT THE AUTHOR

...view details