వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు. చేపపిల్లలను పెంచడం వల్ల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, మదనాపురం ఎంపీపీ పద్మావతి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల - దేవరకద్ర ఎమ్మెల్యే
వనపర్తి జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని, చేపలను విడుదల చేశారు.
చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల