ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో తెగిపోయిన కాలువలను, నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సీఎం కేసీఆర్తో చర్చించానని తెలిపారు. కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరగా... సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
'రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు' - mla visit in kplhapur
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్నారు. కాసేపు నాగలి దున్ని రైతులతో మమేకమయ్యారు.
!['రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు' mla harshavardhan visited damaged crops in kollapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9082684-32-9082684-1602061428086.jpg)
mla harshavardhan visited damaged crops in kollapur
వీపనగండ్ల మండలంలో కల్వరాలలో బీమా-16 ప్యాకేజీ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన... కాలువ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. అనంతరం పొలాల్లోని రైతులతో మాట్లాడి ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకున్నారు. పొలంలోకి దిగి... కాసేపు తానే నాగలి దున్ని విత్తనాలు వేశారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నూతన చట్టంతో.. వినియోగదారులకు మరింత బాసట..