వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలక సంఘంలో చెత్త సేకరణకు రూ. 18 లక్షలతో కొత్తగా కొనుగోలు చేసిన ఆటోలను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన బ్యాంక్ రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి - kothakota muncipal news
వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పర్యటించారు. పురపాలక సంఘంలో చెత్త సేకరణకు రూ.18 లక్షలతో కొత్తగా కొనుగోలు చేసిన ఆటోలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పుర అధ్యక్షురాలు శుకేశిని, ఉపాధ్యక్షురాలు జయమ్మ, ఎంపీపీ మౌనిక, జడ్పీ ఉపాధ్యక్షులు వామన్ గౌడ్, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీపాద్, ఏపీఎం శ్రీనివాసులు, సీడీసీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.