తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2020, 9:36 PM IST

ETV Bharat / state

అమరచింత ఠాణాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు

వనపర్తి జిల్లా అమరచింత ఠాణాలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. నేరాలను తగ్గించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రులు పేర్కొన్నారు.

అమరచింత ఠాణాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు
అమరచింత ఠాణాలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత ఠాణాలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను మంత్రులు ప్రారంభించారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. దాతల సహకారాన్ని అభినందించారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెంరామోహన్ రెడ్డి, వనపర్తి డీఎస్పీ కెఎం కిరణ్ కుమార్, ఆత్మకూరు సిఐ సీతయ్య తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు షెడ్యూల్

ABOUT THE AUTHOR

...view details