తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి నిరంజన్ - నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి సింగిరెడ్డి

వనపర్తి జిల్లా పాన్​గల్ మండలం పాన్​గల్, జమ్మాపూర్, గోప్లాపూర్, దవాజీపల్లి గ్రామాలలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు.

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

By

Published : Apr 10, 2020, 5:25 PM IST

ఇటీవల రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పాన్​గల్ మండలం పాన్​గల్, జమ్మాపూర్, గోప్లాపూర్, దవాజీపల్లి గ్రామాలలో మంత్రి పర్యటించారు. గోప్లాపూర్, దవాజీపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జమ్మాపూర్​లో పేద ప్రజలకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జమ్మాపూర్, పాన్​గల్ మండల కేంద్రంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వాన వల్ల సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ సమగ్ర సమాచారం సేకరిస్తోందని చెప్పారు. ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వటమో, విపత్తు సహాయ నిధి నుంచి సహకారం అందించడమో, బీమా పథకం కింద కవర్ అయ్యేలా ఉంటే ఏదో ఒక పథకంలో వారికి సహకారం అందించటమో చేస్తామని తెలియజేశారు. తప్పనిసరిగా రైతులు పంట బీమా చేయించుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది: దానం

ABOUT THE AUTHOR

...view details