వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని పోల్కి చెరువులో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు పూజలు చేసి చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు పాటు పడ్తుందని, 100 శాతం రాయితీపై చేప పిల్లలు అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి - వనపర్తి జిల్లా పోల్కి చెరువులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కలిసి వదిలారు
ప్రభుత్వం నుంచి మంజూరు అయిన వంద శాతం రాయితీ చేప పిల్లలను వనపర్తి జిల్లా పోల్కి చెరువులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కలిసి వదిలారు.
చేప పిల్లల పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి