తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి - మహబూబ్​నగర్

ఐదు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి టీ10 క్రికెట్​ లీగ్​ మ్యాచ్​లను వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రారంభించారు. మొదటగా మహబూబ్​నగర్​, కరీంనగర్​ జిల్లాల ఆటను తిలకించారు.

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి

By

Published : Aug 22, 2019, 6:17 PM IST

రాష్ట్ర స్థాయి టీ10 పోటీలు ప్రారంభించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఇతర రంగాల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల వసతులు కల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టీ10 ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్​లను ఆయన ప్రారంభించారు. ఈ క్రీడల్లో 8 జిల్లాల నుంచి విద్యార్థులు పోటీ పడుతున్నారు. మొదటగా మహబూబ్​నగర్​, కరీంనగర్​ జిల్లాల ఆటను మంత్రి తిలకించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details