మత్స్యకారుల అభివృద్ధికి తెరాస సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తిలోని నల్ల చెరువులో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, రవాణా, క్రయవిక్రయాల కోసం వాహనాలు, వలలు, విక్రయ కేంద్రాలు, మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకూ 290 చెరువుల్లో కోటి 41లక్షల చేప పిల్లలను వదిలామన్నారు. వనపర్తి పట్టణంలోని పెద్ద చెరువు మొట్టమొదటి సారిగా కృష్ణాజలాలతో నింపడంపై సంతోషం వ్యక్తం చేశారు. జలసంపద పెరుగుతున్న కారణంగా చేపలూ వృద్ధి చెందుతున్నాయని... తద్వారా తెలంగాణ ప్రజలకు, ఇరుగు,పొరుగు రాష్ట్రాలకు బలవర్ధకమైన ఆహారం లభిస్తోందని నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
'మత్స్యకారుల అభివృద్ధికి సర్కారు తోడుగా నిలుస్తోంది' - 'మత్స్యకారుల అభివృద్ధికి సర్కారు తోడుగా నిలుస్తోంది'
చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధితోపాటు.. తెలంగాణ ప్రజలకు, ఇరుగుపొరుగు రాష్ట్రాలకు బలవర్ధక ఆహారాన్ని అందించిన వాళ్లమవుతున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వనపర్తిలో చేపలను చెరువులో వదిలే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

MINISTER NIRANJANREDDY IN FISH RELEASE PROGRAM AT WANAPARTHI
'మత్స్యకారుల అభివృద్ధికి సర్కారు తోడుగా నిలుస్తోంది'