తెలంగాణ

telangana

ETV Bharat / state

'25 వేల మంది ఖాతాల్లోని డబ్బులు వాపస్​' - రైతుబంధు పంపిణీలో తెలంగాణ ప్రపంచ రికార్డు

రైతుబంధు పంపిణీలో తెలంగాణ ప్రపంచ రికార్డు నెలకొల్పిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతిరైతుకూ రెతుబంధు అందిస్తామన్నారు. ఇప్పటికే రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన అన్నారు. 25 వేల మంది ఖాతాల్లోని డబ్బులు వివిధ కారణాలతో వాపస్‌ వచ్చాయని పేర్కొన్నారు. అధికారులకు సమాచారమిస్తే తిరిగి ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు.

minister-niranjan-said-twenty-five-thousand-accounts-not-deposit-rythu-bandhu-money
'25 వేల మంది ఖాతాల్లోని డబ్బులు వాపస్​'

By

Published : Jul 1, 2020, 5:27 PM IST

రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ రైతు బంధు అందిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు. మరో 25 వేల మంది రైతుల ఖాతాల్లోని డబ్బులు వివిధ కారణాలతో వాపస్‌ వచ్చాయని తెలిపారు.

వ్యవసాయ అధికారులకు పూర్తి సమాచారం ఇస్తే తిరిగి ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు. అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక మందగమనం ఒకవైపు, కరోనా మరోవైపు ఇబ్బందులు పడుతున్నా... రైతుల గురించి ఆలోచించిన ఒకే ముఖ్యమంత్రి కేసీఆర్​ అని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి :నాణ్యతాలోపంతోనే 'కొండపోచమ్మ'కు గండి: ఉత్తమ్​కుమార్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details