రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. వనపర్తిలో స్వచ్ఛమైన చెట్ల నీడలో మంత్రి సేద తీరారు. కరోనాను అరికట్టెందుకు తాము కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లామన్నారు.
ఇలాగే సూచనలు పాటిద్దాం: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా అరికట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇలాగే సూచనలు పాటిద్దాం: మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగే కేంద్ర, రాష్ట్రాల సూచనలు పాటిస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడకుందామని కోరారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు