తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం' - అంగన్వాడీ

వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి పర్యటించారు. శ్మశాన వాటిక, అంగన్వాడీ నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు.

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం'

By

Published : Aug 24, 2019, 5:00 PM IST

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం'
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ముందుగా బలిజేపల్లి, జంగమయ్య పల్లి గ్రామాలకు చేరుకున్న మంత్రి అక్కడ శ్మశానవాటిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రహదారి వెంట మొక్కలు నాటారు. అనంతరం ఎర్రగట్టు తండాలో అంగన్వాడీ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. తండాలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. తర్వాత పామిరెడ్డిపల్లికి చేరుకున్న మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి గ్రామాల్లోకి చేరుతున్న సాగునీటి ప్రవాహాలను పరిశీలించారు. గ్రామంలోని పురాతన బావిని పునరుద్ధరించి.. నీటి సరఫరా కోసం పైపులైన్​ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరగా..అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఈరోజే మొదలుపెట్టాలని గ్రామ సర్పంచ్​ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details