వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. స్వామి వారి పల్లకీ సేవ, పుష్పార్చన కార్యక్రమాల్లో మంత్రి దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
వనపర్తిలో వేంకటేశ్వరుని దర్శించుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వనపర్తిలో వేంకటేశ్వరుని దర్శించుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
స్వామి వారి దర్శనంలో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని మంత్రి అన్నారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనే ప్రతీతి ఉందని పేర్కొన్నారు. అందుకే వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు.
ఇదీ చదవండి:ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్