మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంలోని రంగసముద్రం జలాశయంలో చేప పిల్లలను మంత్రి వదిలారు.
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి - వనపర్తి జిల్లా రంగసముద్రం తాజా వార్తలు
రాష్ట్రంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. తాజాగా వనపర్తి జిల్లా రంగసముద్రం జలాశయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తెలిపారు.
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : నిరంజన్‌రెడ్డి
ప్రాజెక్టులో 5 లక్షల 40 వేల చేప పిల్లలు విడుదల చేసినట్లు ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినీల రాణి, ఎంపీపీ గాయత్రి, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, అధికారులు రెహమాన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :తెరాస ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోంది: బండి సంజయ్