పురపాలిక సంఘం ఎన్నికలు పురస్కరించుకొని వనపర్తి పట్టణంలో తెరాస ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'తెరాస గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా' - వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం
పురపాలిక ఎన్నికల్లో భాగంగా వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులు కౌన్సిలర్‌గా ఉంటే పట్టణ అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుందని పేర్కొన్నారు.
'తెరాస గెలిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా'
పట్టణంలోని 5వ వార్డు ఏకగ్రీవంగా తెరాస దక్కించుకుందని... మిగతా 32 వార్డులు తెరాస అభ్యర్థులు కైవసం చేసుకుంటే వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. వనపర్తిని అభివృద్ధిని చేసేందుకు తానెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటానని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: నల్గొండ జిల్లాలో నేల చూపులు చూస్తున్న అభివృద్ధి