తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు.  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

By

Published : Nov 16, 2019, 7:57 PM IST

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు. గోపాల్​పేట, రేవల్లి శ్రీరంగాపురం, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో పర్యటించి సహకార పరపతి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పలుచోట్ల షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా సంఘాలు, సహకార పరపతి సంఘాల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాల వద్ద కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో అంతర్జాతీయ బౌద్ధ సంగీతి

ABOUT THE AUTHOR

...view details