ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి నివారణకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడి తయారు చేసిన వ్యాక్సిన్ మనకు ఒక వరం లాంటిదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. టీకా పంపిణీకి సంబంధించిన వివరాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
'ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనగలిగే శక్తి మానవ మేధస్సుకు ఉందని.. వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలు నిరూపించారు. కొవిడ్ నేపథ్యంలో ముందుండి సేవలందించిన వారికి.. మొదటి విడతగా టీకా పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. దశల వారీగా వ్యాక్సిన్ అందరికీ అందుతుంది.'
నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం చాలా నిశితమైన పరిశీలనతో ఉందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రిలో మొట్టమొదటిగా టీకా వేసే స్టాఫ్ నర్స్ తిరుపతమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనగలిగే శక్తి మానవ మేధస్సుకు ఉందని.. వ్యాక్సిన్ తయారు చేసిన మేధావులు శాస్త్రవేత్తలు నిరూపించారు. కొవిడ్ నేపథ్యంలో ముందుండి సేవలందించిన వారికి.. దేశవ్యాప్తంగా మొదటి విడతగా పంపిణీ చేసేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దశల వారీగా వ్యాక్సిన్ అందరికీ అందుతుంది.
'వ్యాక్సిన్ ఓ వరం.. శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం' ఇదీ చదవండి:ప్రపంచంలోని నాలుగు టీకాల్లో రెండు మనవే: కిషన్ రెడ్డి